మండలి సెలక్ట్ కమిటీకి పేర్లు పంపిన టిడిపి

అమరావతి: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలి ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీకి తెదేపా పేర్లు పంపింది. మూడు రాజధానుల బిల్లుకు లోకేశ్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బి.టి.నాయుడు, సంధ్యారాణి పేర్లను తెదేపా పంపించింది. సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీదా రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లను తెదేపా పంపింది. మూడు రాజధానుల బిల్లు కోసం పీవీఎన్‌ మాధవ్‌, సీఆర్‌డీఏ రద్దు బిల్లు కోసం సోము వీర్రాజు పేర్లను భాజపా పంపించింది. అలాగే పీడీఎఫ్‌ నుంచి మూడు రాజధానుల బిల్లుకు కె.ఎస్‌.లక్ష్మణరావు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు కోసం ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లను పీడీఎఫ్‌ పంపింది.