మర్రిపాలెంలో మొదలైన ట్రాఫిక్ సమస్య ...

విశాఖపట్నం : రైలు ఆగినపుడు పెద్దసంఖ్యలో ప్రయాణికులు దిగి వస్తారు. ఈ సందర్భంలో పరిస్థితి మరీ దారుణం. జంక్షన్‌లో ట్రాపిక్‌ క్రమబద్దీకరించే వారు ఎవరూ కనిపించరు. దీంతో అడిగే వారు లేదు కదా అని వాహనచోదకులు ఇష్టానుసారం రాకపోకలు జరుపుతారు. దీంతో అప్పుడప్పుడు ట్రాఫిక్‌ నిలిచిపోవడం, చోదకుల మధ్య తగాదాలు, ఇతరితర సమస్యలు ఎదురవుతుంటాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పూట పరిస్థితి మరీ దారుణమనే చెప్పాలి. స్కూల్స్‌కు, కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లే వాళ్లతో రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. ఒకేసారి పదుల సంఖ్యలో వాహనాలు, పాదాచారులు రావడంతో ఇబ్బంది తప్పదు. ఇక మర్రిపాలెం రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లు ఆగుతాయి.ఎవరి పనుల్లో వారు ఎవరి ఆలచలో వారు అలా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ వెళ్లిపోతారు. ఈ జంక్షన్‌లో నిత్యం ప్రమాదాలతో సాహసం చేస్తూ వాహన చోదకులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధాన రహదారిలో పరిస్థితే ఇంత ఇబ్బందికరం అనుకుంటే జంక్షన్‌లో పరిస్థితి మరీ దారుణం ఈ జంక్షన్‌లో బిఆర్‌టిఎస్‌ ప్రధాన రహదారి నుంచే కాకుండా మర్రిపాలెం రైల్వేస్టేషన్‌కు వెళ్లె దారి నుంచి అధిక సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.ఇక్కడ ట్రాఫిక్‌ సిగ్నిల్స్‌ ఉంటాయి కానీ పనిచేయడు, ఇంత రద్దీగా ఉన్న రహదారిలో కనీసం చూడడానికైనా ట్రాఫిక్‌ పోలీసు కనిపించరు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న క్రమబద్దీకరించాల్సిన వారు ఎవరైనా కనిపిస్తారా అంటే అది ఉండదు.ఇప్పటికైనా ట్రాఫిక్ నియంత్రణ అధికారులు స్పందించి ఇక్కడ పోలీసు పోస్టు పెట్టి ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకొని ప్రజలకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నారు.