నాగర్‌కర్నూల్: ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఏ విధంగా శిక్షించినా.. కామాంధుల పైశాచికత్వం మాత్రం ఆగడం లేదు. తాజాగా, మరో మహిళపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం, బట్టవర్లపల్లి అటవీప్రాంతం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో దగ్గరికెళ్లి చూసిన పశువుల కాపరులు.. భయపడి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడున్న ఆనవాళ్ల కోసం పోలీసులు గాలించారు. కాగా, మహిళను అత్యాచారం చేసిన దుండగులు, గొంతుకోసి చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మహిళ ఆనవాళ్ల ఆధారంగా ఆమె ముంబయికి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై అత్యాచారం చేసి గొంతుకోసి చంపిన దుండగులు .