విశాఖపట్నం : విశాఖపట్నంలో దిగాల్సిన ఇండిగో విమానం సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంది.బెంగళూరు నుంచి బయలుదేరిన ఆ విమానం విశాఖ చేరుకునేసరికి గాలులు విపరీతంగా వేయడంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సుమారు గంటపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. వెంటనే ఇక్కడి అధికారులకు సమాచారమిచ్చి విమానాశ్రయంలో దించారు. ఇక్కడ ఇంధనం నింపుకొని అరగంట అనంతరం ఆ విమానం విశాఖకు బయలుదేరివెళ్లింది.
రాజమహేంద్రవరంలో దిగిన విశాఖ విమానం.