ఇండియా -న్యూజిలాండ్ : టీమిండియా వన్డే వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కివీస్‌తో జరగబోయే వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ గాయంతో బాధపడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రం కావడంతో మధ్యలోనే గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. దీనితో అతను రాబోయే సిరీస్‌కు దూరం కానున్నడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. కాగా, ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.
వచ్చే వన్డే, టెస్ట్ సిరీస్‌లకు హిట్‌మ్యాన్ దూరం!