విశాఖ : అర్హులకు ఇస్తున్న పింఛన్‌లను రద్దు చేయడంపై జివిఎంసి 36వ వార్డు సిపిఎం మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల కారణాలు చెప్పి పేదల కిస్తున్న పింఛన్‌లు రద్దు చేయడంపై ఈ సందర్భంగా పార్టీ బృందం జివిఎంసి 43వ వార్డు కంచరపాలెం ప్రాంతం, దయానందనగర్‌లో పర్యటించారు. పింఛన్‌లు రద్దు అయిన వారిని కలిసి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం 750 ఎస్‌ఎఫ్‌టి ఇల్లు ఉందని పింఛన్లు రద్దు చేయడం ఏమాత్రం మంచిది కాదని బృందం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా జివిఎంసి 36వ వార్డు మాజీ కార్పొరేటర్ బొట్టా మాట్లాడుతూ 750 ఎస్‌ఎఫ్‌టి ఇల్లులను ప్రభుత్వమే కట్టించి ఇచ్చిందని పేర్కొన్నారు.రద్దు చేసిన పింఛన్లు తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పింఛన్లు పునరుద్ధరణ కోసం సోమవారం జ్ఞానాపురం మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తునామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ రద్దు కాబడిన వారంతా హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు, పార్టీ నాయకులు ఎన్.సింహాచలం, ఎం.ఈశ్వరరావు, కె.రాంబాబు, పుష్ప, బి.ప్రసాద్, రమణ, కనక మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
అర్హులకే పెన్షన్ తీసేస్తే చూస్తూ ఊరుకోం. ఇదేనా పాలనా : సి.పి.ఐ.(యం)