కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఆదివారం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను స్థానిక నాయకులు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దక్షిణ దినజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం..స్మృతి దాస్ అనే మహిళ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వారి సొంత భూమిలో ప్రభుత్వ రోడ్డు వేయడానికి పంచాయతీ పెద్దలు సిద్ధమవడంతో ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన వారు ఆమె కాళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు.దీన్ని అడ్డుకున్న ఆమె సోదరిని కూడా అదే తరహాలో ఈడ్చుకెళ్లడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఆ నాయకులంతా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో జిల్లా టీఎంసీ అధ్యక్షుడు దీనిపై స్పందించారు. వెంటనే సదరు నాయకుణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు
రోడ్డుమీద కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకెలుతున్న అడిగితే : మానవత్వం మంటకలిచిన వేళ,..