ఈ ఊరుకి ఆ ఊరెంత దూరమో ! ఆ ఊరికి ఈ ఊరూకి అంతే దూరం .

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోమవారం మలేషియా దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విమానం భారతదేశ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లుపాక్ విమానయాన రంగ అధికారులు చెప్పారు. పుల్వామా దాడి, భారత్ వాయుసేన దాడుల ఘటనల అనంతరం పాక్ తన గగనతలం మీదుగా భారత విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించింది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలు విదేశీ పర్యటనలు జరిపినపుడు వారి విమానాలు కూడా పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానం తన గగనతలంమీదుగా రాకపోకలు సాగించకుండా నిషేధించిన పాకిస్థాన్ తీరుపై భారతప్రభుత్వం అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది.దీంతో సోమవారం మలేషియా దేశ పర్యటనకు రానున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన విమానాన్ని భారత గగనతలం మీదుగా ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ విమానయాన వర్గాలు తెలిపాయి.