సచివాలయం ఉద్యోగిపై దాడి....

కాకినాడ నగరం : కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సూర్యనారాయణపురం దూళ్లవారి వీధిలో 28వ వార్డు సచివాలయం-2లో పనిచేస్తున్న వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ కోసూరి వెంకట సురేష్‌పై ఓ వ్యక్తి ఆదివారం దాడి చేశాడు. సురేష్‌ సచివాలయంలో విధులు పూర్తిచేసుకుని తన ద్విచక్ర వాహనాన్ని తీస్తుండగా, రెల్లిపేటకు చెందిన సాయి అనే వ్యక్తి అతడితో గొడవకు దిగాడు. సచివాలయ ఉద్యోగులు వారిస్తున్నా వినకుండా సురేష్‌పై దాడిచేసి గాయపరిచాడు. చేతికి, నోటికి గాయాలవడంతో అతడ్ని జీజీహెచ్‌కు తరలించారు. మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను సచివాలయ ఉద్యోగులు ఖండించారు.ఏది ఏమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం తప్పని ప్రజలు ఖండిస్తున్నారు..