శ్రీకాకుళం : ఫిబ్రవరి 1: శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి సందర్భంగా శుక్రవారం రాత్రి అరసవెల్లిలో రధసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. వేద మంత్రాలు, వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళధ్వనులతో ప్రత్యేక పూజులుతో ఆదిత్యుని క్షీరాభిషేకం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్.పి. ఆమ్మిరెడ్డి ఏర్పాట్లను పరీశీలించారు. శుక్రవావరం అర్ధరాత్రి దాటిన తరువాత ముహుర్త సమయాన విశాఖపట్నం శారదా పీటం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి పాల్గొని ఆదిత్యునికి పట్టు వస్ట్రాలు సమర్పించి ప్రత్యేక పూజులు చేశారు. రాష్ట్ర శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసన సభ్యులు రెడ్డి శాంతి, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, మాజీ విప్ కూన రవికుమార్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.రధసప్తమి వేడుకలు సందర్భంగా శ్రీసూర్యనారాయణ స్వామి నిజరూపాన్ని వీక్షించి దర్శించి తలించాలని ఎంతోమంది భక్తులు జిల్లా నలుమూలలనుండి తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఈవో వి. హరిసూర్యప్రకాష్, ఆర్.డి.ఓ. ఎం.వి రమణ, ఆలయ ప్రదాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అరసవల్లిలో రధసప్తమి వేడుకలు