ఆర్.కె.రోజాకు మంత్రి పదవి రానుందా ?

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్.కె.రోజాకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఇదే ప్రచారం ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. శాసన మండలి రద్దుతో రోజాకు కలిసి వచ్చే ఛాన్స్‌ ఉందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో మండలి రద్దు నేపథ్యంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తారా లేదా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఎందుకంటే ! వైసీపీ ప్రభుత్వమే శాసన మండలి రద్దు అంశాన్ని లేవనెత్తింది. అసెంబ్లీలో దీనిపై ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది.దీంతో మండలి సభ్యులుగా  ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని వైసీపీ పెద్దలు తీవ్రంగా చర్చిస్తున్నారాట. మండలి రద్దుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కొనసాగడం నైతికంగా సరికాదనే వాదనే ముఖ్యమైన కారణమట. దీంతో త్వరలోనే ఈ ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట.ఆ ఇద్దరు  మంత్రులు గనుక రాజీనామాలు చేస్తే ఆ తదుపరి పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు ఖాళీ అవనున్న నేపథ్యంలో గతంలో ఈ పదవులు ఆశించి భంగ పడ్డవారికి ఇచ్చే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.నిజానికి ఆమె  తొలిసారి మంత్రివర్గంలోనే పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆ లిస్ట్‌లో ఆమె లేదు. అనంతరం రోజాకు ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. ఆ పదవితో ఆమె సంతృప్తి చెందకున్నా, సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతో రోజా ముందుకు సాగారు. అయితే ఇప్పుడు మాత్రం రోజా మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, పలువురు రాజకీయ పండితులు తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. చూడాలి మరి మంత్రి అయ్యే ఛాన్స్ రోజాకు ఉందో లేదో ! మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.