మండలంలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు.

సంతకవిటి : స్థానిక మండలంలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా మూడు టీములుగా ఏర్పడి టీకాలు వేయడం జరుగుతుందని స్థానిక యానిమల్ హస్బెండరీ ఎ.డి.మాణిక్యాల రావు అన్నారు. అలాగే పశువులకు ఇనాఫ్ చెవిపోగులు వేస్తున్నామన్నారు. మండలంలో పశువులు గల రైతులు ఈ అవకాశం వినిపించుకొని గాలి కుంటు వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా  టీకాలు వేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమం మార్చి 16వ తేదీ వరకూ సాగుతుందని రైతులు సిబ్బందికి సహకరించి టీకాలు,చెవి పోగులు వేయించుకోవాలని ఆయన కోరారు.