శ్రీకాకుళం :జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులకు జీతాలు కావాలంటే ట్రెజరీ ఉద్యోగులకు ముడుపులు ముట్ట జెప్పాల్సిందే.లేకుంటే రోజూ అదిలేదు,ఇదిలేదని చెప్పి పంపిస్తున్నారని,చివరకు అన్నీ ఉన్నా సెర్వర్ డౌన్ లో ఉంది రేపు రండి మాపు రండని విసిగించి ఒక ఉద్యోగి నుండి నెలకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు పందికొక్కుల్లా వసూలు చేస్తున్నారని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చి "తడి తక్కువ తమాషా ఎక్కువ" అన్న సందంగా వారికి ఇచ్చే జీతం తక్కువ పని ఎక్కువగా చేయిస్తుంటే, వారికి జీతాలు ట్రెజరీనుండి విడుదల కావాలంటే, ముడుపులు ముట్టనిదే జీతాలు రావడం లేదని జిల్లాలో ఈ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. వచ్చిన జీతాలు తమ ప్రయాణ ఖర్చులకే చాలక ఇబ్బందులు పడుతున్న మాకు ఈ లంచ బాధేమిటని కొందరు ఆవేదన వ్యక్తంచేస్తూ ముడుపులు చెల్లించి జీతాలు తీసుకున్న వారు కొందరైతే,మేమెందుకు ఇవ్వాలి అని అడిగేవారు తమ డ్యూటీ చేసుకొని ప్రతిరోజూ ట్రజరీ దర్శనం చేస్తున్న వారు మరికొందరు ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన విశ్వసనీయ సమాచారం.ఇక గ్రామాలలో పనులు చేయించిన కాంట్రాక్టర్ల దగ్గర అయితే వారు చెప్పినంత ఇవ్వకపోతే చెప్పులరిగేటట్లు తిరగాలే తప్ప బిల్లులు కావటం లేదట. రాష్ట్రంలో అవినీతి పూర్తిగా లేకుండా చేస్తాను అని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి ఈ విషయం తెలియక పోవడం చాలా బాధాకరం అని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. జిల్లా అధికారులు ఈ విషయంలో తమ తమ ఆవేదనలను అర్థం చేసుకొని ముందు ముందు అయినా ఈ లంచగొండుల భరతం పట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ప్రభుత్వ పాలకులకు చెడ్డ పేరు అనతి కాలంలో తప్పదని హెచ్చరిస్తున్నారు.
"లంచం" లేనిదే అక్కడ ఏమీ జరగదట.