రోడ్డు ప్రమాదం పదిమంది మృతి.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం !

ముంబయి : మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్‌ జిల్లా యావల్‌ తాలుకాలోని హింగోణాలో ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల వివాహానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.