శ్రీకాకుళం : మార్చి 15 : స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు వివిధ కేటగిరీల క్రింద అధికారులు, సిబ్బందికి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిది ఆది వారం ఒక ప్రకటలో తెలిపారు.15వ తేదీ మాస్టర్ ట్రైనర్స్ కు, 17వ తేదీన మండల కేంద్రాలలో పి.ఎ, ఏపిఓ లకు శిక్షణా కార్యక్రమంతోపాటు ఇతర శిక్షణా కార్యక్రమాలు వాయిదా పడ్డాయని ఆయన చెప్పారు. ఈ మార్పును సంబంధిత ఉద్యోగులు గుర్తించాలని చెప్పారు. శిక్షణా కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించేది తెలియజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.
ఎన్నికల సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు వాయిదా :డి.ఆర్.ఓ :దయానిధి