చుట్టపు చూపుగా వచ్ఛి. తిరిగి వెళ్తూ..

వెల్లుట్లపేట : హోలీ పండుగకు చుట్టపు చూపుగా వచ్చి తిరిగి వెళ్తూ ప్రమాదవశాత్తు మూలమలుపు వద్ద ద్విచక్రవాహన దారుడు రోడ్డు పక్కకు పడిన గాయాలపాలైన ఘటన ఎల్లారెడ్డి మండలంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపేట మండల్‌ కొండాపూర్‌ గ్రామానికి చెందిన కాశీరాం(32) ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా ప్రమాద బారిన పడ్డాడు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.