10 పరీక్షలు వాయిదా : ఎ.పి.ప్రభుత్వం నిర్ణయం

అమరావతి : ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణం ఏమై ఉంటుందో మీకు తెలుసు. అదే  కరోనాయే. ఈ వైరస్ రాన్రానూ పెరుగుతుంటే కఠిన చర్యలు, లాక్ డౌన్ల నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు పరీక్షల్ని కూడా వాయిదా వేస్తున్నాయి. ఏపీలో రూల్ ప్రకారం... ఈ నెల 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఐతే వాటిని రాబోయే రెండు వారాలపాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు వారాల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే మరిన్ని రోజులు వాయిదా వేసే అవకాశం ఉందని తెలిసింది. పరీక్షలు ఎప్పుడు జరిపేదీ త్వరలో తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది