ఢిల్లీ : ప్రపంచ దేశాలను సైతం గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్‌రైల్వే సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇంటర్ సిటీ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైళ్లు, పూర్తిగా క్యాన్సల్ చేసింది. 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు యథావిధిగా నడుపుటకు రైల్వే శాఖ నిర్ణయించడం జరిగింది. రైల్వేకు ఆదాయం వచ్చే వస్తు రవాణా మాత్రం యధాతధంగా నడుపుతున్నా సిబ్బంది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపకపోవటంపై గూడ్సు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కనీసం డ్యూటీలో ఉన్న ఫైలట్,అసిస్టెంట్ ఫైలట్ గార్డులకు మాస్కులు శానిటైజర్లయినా ఇచ్చి వారి ఆరోగ్యం రక్షించే బాధ్యత రైల్వే శాఖ విస్మరించడంపై పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రైల్వే వస్తురవాణా సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని వారిని చూసిన ప్రజలు సైతం కోరుతున్నారు.వీరు కూడా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతాలకు రైల్లను నడుపుతూ ఆ ప్రాంతంలో కొంత సమయం విశ్రాంతి ఉంటుంది.కాబట్టి వీరి నుండి ఇతరులకు,అలాగే ఇతరుల నుండి వీరికి ఈ వైరస్ సోకకుండా రైల్వే శాఖ అధికారులు చర్యలు తీసుకొంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
ఈ నెల 31 వ తేదీ వరకూ రైల్వే పాసింజరు సర్వీసులు రద్దు, గూడ్స్ రైల్లు యధాతధం : ఆ సిబ్బంది ఆరోగ్యంపై శాఖ నిర్లక్ష్యం.