విశాఖపట్నం : కరోనావైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వీయనిర్భందంలో ఉండనున్నారు. విశాఖపట్నంలో ఉదయం 6 గంటలకే కర్ఫ్యూ మొదలైంది. అయితే రాష్ట్రంలో ఈ కర్ఫ్యూ 24 గంటలపాటు కొనసాగనుంది. జనతా కర్ఫ్యూకి వ్యాపార, వాణిజ్య వర్గాలు సంఘీభావం తెలిపాయి. దీంతో అత్యవసరం మినహా అన్ని సేవలు, దుకాణాలు బంద్ అయ్యాయి.
కరోనా జనాతా కర్ఫ్యూ విశాఖలో