చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని "లాక్ డౌన్" లో ఉంటే నిన్న మొదటి సారి కొత్త కేసులు రాకుండా ఉంది. దీని బట్టి మనం ఎంత జాగ్రత్త గా ఉండాలి ఆలోచించండి.మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే. ఒకసారి భారత దేశంలో పాకింది అంటే, కనీసం కోటి మంది చనిపోతారు.వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు, ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది.దయచేసి ఇంట్లో ఉండండి. చదువుకొని వాళ్ళకి దీని ప్రాముఖ్యత చెప్పండి.ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటేనే అంత మంది చచ్చిపోయారు. మన దేశంలో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్లో.మేము బాగున్నాం, మాకు ఏమి కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలిలో నుంచి కూడా వస్తుంది అని ఇవాళే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గుతుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసుకోవడం కోసమే. దయచేసి డాక్టర్స్ కి , నుర్సులకి, పని పెంచవద్దు.ఎక్కడికి వెళ్లద్దు. మీకు ఎవరిమీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళని చూడకుండా ఉండండి. దయచేసి ఎవరో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందని తిరగద్దు.మన దేశం వాళ్ళకి ఇమ్మునిటీ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ చస్స్తుంది, ఇవన్నీ నిజాలు కావు. అది ఏ ఉష్ణోగ్రతలో అయిన వ్యాపిస్తుంది.
1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశం లో 1కోటి మంది చచ్చిపోయారు. అపుడు విమానాలు లేవు, షిప్ లు ఇంత లేవు. అయినా కూడా అంత వ్యాపించింది.దయచేసి, మాకు మా దేశంలో 300 మంది మాత్రమే ఉన్నారు అని తక్కువ అనుకోకండి. 1 వారం లో నే ఇటలీ ఇరాన్ లో 300 నుంచి 6000-7000 వరకు 2 వారాలులో 20,000 కు పెరిగిపోయాయి.చేతులు శుభ్రం గా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి.ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకావద్దు.ఇంట్లో ఉండండి. దగ్గు, జలుబు ఉంటే ఎవరిని తాకవద్దు.దయుంచి ఏ ఇద్దరు కలసి ప్రయాణం చేయడం,దగ్గరగా ఉండకండి. ప్రభుత్వ ఆదేశాలు పాటిధ్ధాం దేశాన్ని రక్షిధ్ధాం.
"లాక్ డౌన్"విధిగా పాటిధ్ధాం.మనల్ని మనమే "కరోనా"నుండి రక్షించుకొందాం.