"కరోనా" వైరస్ నివారణలో "వాల్తేరు" గ్రామం ఆదర్శం.

సంతకవిటి : ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న "కరోనా" నుండి తమ గ్రామాన్ని స్వీయ దిగ్బందంలో పెట్టి  గ్రామ ప్రజలను రక్షించుకొనే ప్రయత్నం స్థానిక మండలంలో గల వాల్తేరు యువకులు చేయడం పట్ల పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.ఈ గ్రామానికి వచ్చే పోయే రహదారులు అన్నీ మూసివేశారు. అదేకాక మందు లేని ఈ మహమ్మారి నుంచి రక్షణ స్వీయ దిగ్బందమే.అందుకు ఎవరికి వారు బాధ్యతగా ఉండి,ఒక మనిషికి వేరొక మనిషికి కనీసం రెండు మీటర్ల దూరం పాటించి, ప్రతీ ఇరవై నిమిషాలకు ఒక పర్యాయము చేతులు కాలు సబ్బుతో శుభ్రం చేసుకొని ఉండాలని వీదుల్లో తిరిగి అందరికీ అవగాహన కల్పించారు.అంతేగాక తమ గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వస్తే అన్ని ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వం ద్వారా చేసిన తర్వాతే రావాలని గ్రామ యువకులు కోరారు.ఈ వైరస్ ని కట్టడి చేయాలంటే సామాజిక దూరాన్ని పాటించాలి అని యువకులు అంతా కలిసి వారు రెండు మీటర్ల దూరం పాటించి గ్రామంలో అన్ని వీదుల్లో తిరిగి  అందరికీ అవగాహన కల్పించే విధానాన్ని పలు గ్రామాల ప్రజలు గ్రామ పెద్దలను,యువకులను ప్రశంసించారు.అలాగే ఆ గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలచిందని అనేక గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. అదేవిధంగా "వాల్తేరు" గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా "కరోనా" వైరస్ తమ గ్రామాలకు రాకుండా అవగాహన కల్పిస్తామంటున్నారు.