శ్రీకాకుళం : నేడు కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజలను అప్రమత్తం చేసి ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు,ఇచ్చే సంక్షేమ పధకాలు ప్రజలకు చేరవేసేది మీడియానే. ఇటు ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేసి సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చి ప్రజలకు ప్రభుత్వాలకు మద్య సందానకర్త ఒక్క జర్నలిస్ట్ మాత్రమే.అలాంటి జర్నలిస్టులను నేడు ప్రభుత్వాలు మరిచిపోవడం విచారించదగ్గ విషయం. జీతం లేకుండా, లాభం చూడకుండా, సమాజం కోసం అహర్నిశలు పని చేసేది, నిరంతరం పాటు పడేది కేవలం మన మీడియా మిత్రులే అని సగర్వంగా చెప్పవచ్చును. అటువంటి మనలను మరిచిన కేంద్రం మరియూ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పధకాలు, నగదు బదిలీ అందుబాటులోకి తెస్తున్నాయి.కానీ నిరంతరం సమాజాన్ని జాగృత పరిచి, జనంకోసం పని చేసే జర్నలిస్టుని, కళాకారులను మాత్రం మరిచారు. ఇది నేటి పాలకుల నిర్లక్ష్యమా లేక మన చేతకానితనమా మనకు మనమే ప్రశ్నించుకోవాలి.కనీసం దేశం లాక్ డౌన్ సమయంలో పని చేసే ప్రతీ జర్నలిస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం ఇచ్చి ప్రత్యేక సంక్షేమ పధకాలు వెంటనే అమలు చేయాలని జర్నలిస్టులు, కళాకారులు కోరుతున్నారు.ఇక జర్నలిజానికి వస్తే మనలో కొందరు విలేకరులు సొంత గ్రామాలను విడిసి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నివాసం ఉండి ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబ పోషణ భారమైనా పట్టించుకోకుండా వార్తల సేకరణకు అదనపు కర్చులతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిని ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము పూర్తిగా భావిస్తూ, యాజమాన్యాలను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము.ఇటువంటి ఆపత్కాలంలో ఆమాత్రం మనకోసం ఆలోచించకపోతే మనం కూడా యోచించి ఈ సమాజం కోసం మనమెందుకు శ్రమపడాలో యోచించమని మేధావులైన మన మిత్రులను కోరుతున్నాను.
విధినిర్వహణలో అనారోగ్యాలు, ప్రమాదాలకు గురై మెరుగైన వైద్యనికీ కూడా నోచుకోలేక పోయి అకారణంగా మృతి చెందిన జర్నలిస్టుల ఎందరో ఉన్నారు.మనకు కుటుంబాలు వున్నాయి. ప్రపంచాన్ని ప్రక్కన పెట్టి మన దేశం లాంటి ప్రజస్వామ్య దేశాలలో నాలుగో స్తంభం మన మీడియాగా చెబుతారే? అటువంటి మనకు మన కుటుంబాలకు న్యాయం చేయని,సంక్షేమం చూడని ఈ సమాజం,ఈ ప్రభుత్వాలు మనకు అవసరమా? విఙ్ఞులైన మేధావులారా యోచించండి. ఆపత్కాలంలో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు, రైతులకు, చిరువ్యాపారులకు, వృత్తి నైపుణ్య దారులకు ఇలా ఎంతోమందికి సబ్సిడీలు కల్పించి, రుణాలు ఇచ్చి అదుకుంటున్నాయి. అటువంటిది ఏ ఆర్థిక అధారాలు లేని విలేకర్ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలోషించక పోవడం ఎంత వరకు సమంజసం.మనమూ మనుషులము కామా? మనకు ప్రాణాలపై ఆశ లేదా? మనకు కుటుంబాలు లేవా? మనకు ఈ ప్రజాస్వామ్యంలో మిగిలిన మూడు స్తంభాలులో ఉన్న వారిలా ఎందరికి జీత భత్యాలు వస్తున్నాయి? నేటి సమాజంలో అందరిలా బ్రతకటానికి ఎన్నో వృత్తులు ఉన్నా, మనం ఈ వృత్తిని విడిచి వేరు వృత్తి చేయడం చేతగాక కాదని నేటి సమాజం,ప్రభుత్వాలు గుర్తించాలి.కళాకారులు,కవులను విస్శరిస్తే,వారే ఉపవృత్తులవైపు ప్రయాణం చేసిన నాడు ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా? కావున దేశాన్ని ఏలుతున్న ఏలికలారా మమ్మల్ని గుర్తించండి అని మా జర్నలిస్టు సమాజం కోరుతుంది. లేదూ ఈ ఓట్లు రాజకీయాలు చేద్దాం అన్నా మాకూ కుటుంబాలు ఉన్నాయి.ఆ కుటుంబాలకు ఓట్లున్నాయని కళాకారులు, కవులు మేధావులు ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. నమస్కారం ....సదా సమాజం శ్రేయస్సును కోరే జర్నలిస్ట్...కళాకారులు ...
కవులు ,కళాకారులు,జర్నలిస్ట్ లను మరచిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు