మోదుగులపేట సచివాలయ సిబ్బంది "కరోనా" నివారణకు మేము సైతం.

సంతకవిటి : స్థానిక మండలం మోదుగులపేట సచివాలయ సిబ్బంది తమ సచివాలయ  గ్రామాలలో తిరిగి "కరోనా" వైరస్ వ్యాప్తి ఎలా చెందుతుంది. రాకుండా ఎలా నియంత్రణ చేయాలి అనే విషయంపై ప్రజలకు అవగాహన చేశారు.స్వీయ నియంత్రణే మార్గమని ఎవరికి వారు బాధ్యతగా మెలిగి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అవగాహన కల్పించారు.ఈ వ్యాధి చైనాలో పుట్టి ప్రపంచ దేశాలలో ఎలా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిబారిన పడి ప్రభుత్వం చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి ఇటలీ ప్రజలు నేడు ఎలా పిట్టల్లా రాలిపోతున్నారో తెలియజేసి ప్రజలు అప్రమత్తంగా ఉండి శుచి శుభ్రత పాటిస్తే మనకు ఎటువంటి హాని జరగదని ప్రజలలో ధైర్యాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి పొగిరి కృష్ణ, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ గురుగుబెల్లి కిరణ్ కుమార్, సచివాలయ మహిళా పోలీసు సంతోషి కుమారి, మరియు అగ్రికల్చరల్ అసిస్టెంట్ ,మరియు ఆయా గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.