ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్ విధించారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాంటి కార్మికులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద డబ్బు జమ చేయాలని కేంద్ర కార్మికశాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కార్మిక సంక్షేమ బోర్డు వసూళ్లు చేసిన సెజ్ ఫండ్‌లో ఉన్న డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సూచించారు. ప్రస్తుతం సెజ్ ఫండ్‌లో రూ. 52వేల కోట్లు ఉన్నాయి. 3.5 కోట్ల కార్మికులు ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్నారు.వారి ఖాతాలకు నగదు బదిలీ కానుంది.
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండ.