బోరున విలపిస్తున్న ఇటలీ అధ్యక్షుడు : అందుకే జాగ్రత్త అంటున్న భారత ప్రధాని.

రోమ్: కరోనా మహమ్మారికి ఇటలీలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే దేశ పరిస్థితిపై దేశాధ్యక్షుడు సర్గియో మట్టరెల్లా బోరున విలపించారు. కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు ఉన్న దేశం. అలాంటి దేశ అధ్యక్షుడే ఎవరిని కాపాడలేమంటూ చేతులెత్తేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు, శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు.ప్రస్తుతం ఇటలీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కరోనా ప్రభావిత దేశాల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఇటలీ నిలిచింది. ప్రస్తుతం చైనా ఆ వైరస్ నుంచి కోలుకొని రెండో స్థానానికి వెళ్లింది. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో మతాచారాల ప్రకారం పూడ్చడం కంటే సామూహికంగా దహనం చేయడం ఉత్తమమని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.మనకేమి లేదు అని విర్రవీగి రోడ్డుమీద,వీదుల్లో తిరిగే వారు జర జాగ్రత్త అని మన భారత ప్రభుత్వం హెచ్చరిస్తుంది.