హైదరాబాదు : ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం కావాల్సిన టీవీ సీరియల్ కార్యక్రమాలు నిలిపివేసినట్లు తెలుస్తున్నది. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటల వరకు పలు చానెళ్లలో ప్రసారం కావాల్సిన సీరియల్స్ కు బదులు ఇతర ప్రోగ్రామ్స్ వచ్చాయి. నిన్న మొన్న వచ్చిన వినోద భరితమైన కార్యక్రమాలు పదే పదే ఈరోజు కూడా రావడంతో ఇండ్లలో టీవీలకు అతుక్కుపోయిన మహిళలు అసంతృప్తికి లోనయ్యారు. బహుశా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో టీవీ సీరియళ్ల షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తున్నది. ఒకవేళ షూటింగ్ పూర్తయిన కార్యక్రమాలకూ ఎడిటింగ్ చేసే వ్యక్తులు లాక్ డౌన్ వల్ల అందుబాటులో లేరని సమాచారం. అందువల్లనే గురువారం ఇతర ప్రయివేటు కార్యక్రమాలు ప్రసారం చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం అన్ని అంశాలపై పడిందని గుసగుసలు నడుస్తున్నాయి. పాపం మహిళలు ఎలాగ కాలం గడుస్తుందో ఏమిటో ? అవకాశం ఉన్నంతవరకూ గత కాలంలో ప్రసారం అయిన ప్రజాధరణ పొందిన కొన్ని సీరియల్స్ మరలా ప్రసారం చేసే దిశగా టి.వి. చానల్ లు ఉన్నట్లు తెలుస్తుంది.
"కరోనా" మహమ్మారి బుల్లితెరపై పడింది.