అమరావతి : ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండకపోతే వ్యాధిని నియంత్రించలేమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్, ఏపీ.. తెలంగాణ సరిహద్దు వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న రాష్ట్రంలోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. ఒక్కసారి ప్రదేశం మారితే వాళ్ల ద్వారా ఇబ్బందులేంటని ఆలోచించాలన్నారు. ఈ మూడు వారాలు ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలని సూచించారు. వేరే చోటుకి మారితే వారి వివరాలు సేకరించడం కష్టమవుతుందని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఏపీవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.రైతులు తప్పనిసరి పరిస్థితిలో పొలం పనులకు వెళ్ళాల్సి వస్తే మనిషికి మనిషికి మద్య రెండు మీటర్లు దూరంలో ఉండి పనులు చేయాలని సూచించారు . అంతేకాక ఇటువంటి విపత్కర పరిస్థితిలో అందరం కలిసి ఈ "కరోనా" బారినుండి రక్షించుకొందామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
మూడు వారాలు ఎక్కడ వారక్కడే ఉండి సహకరించంచండి : రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా నేనున్నాను : ముఖ్యమంత్రి