రాష్ట్రంలో వాయిదా పడ్డ ఇల్ల పట్టాల పంపిణీ.

అమరావతి: కరోనా దృష్ట్యా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీని ఏప్రిల్‌ 14కు వాయిదా వేసింది. తొలుత ఉగాది పండుగ రోజు పేదలకు ఇళ్ల పట్టాలను అందించాలని భావించింది. దాని కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. దీనికి ఎస్ఈసీ అనుమతిని మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పట్టాల పంపిణీని ఏప్రిల్‌ 14కి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.