న్యూఢిల్లీ : ప్రజలపై ప్రేమ పెరిగి ప్రజలను రక్షించే నెపంతో రైల్వే శాఖ ప్లాట్ ఫామ్ టిక్కెట్ అమాంతంగా ఐదు రెట్లు పెంచడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని సేవలు ఉచితంగా చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రజలకు అత్యవసర పరిస్థితిలో తప్ప ప్రయాణం చేయరాదని అవగాహన కల్గించాలి.అంతేకాని ఇలా ఆర్థికంగా దోచుకోవడమేమిటని పలువురు అంటున్నారు.వాస్తవంగా ప్రజలు తెలివైన వారు. ఇలా ప్లాట్ ఫామ్ టికెట్ రేటు పెంచినా పాసింజరు మినిమమ్ టిక్కెట్ కొనుగోలు చేసి ప్లాట్ ఫామ్ పైకి వస్తారే తప్ప ఇది అమలుకు సాధ్యం కాదని చదువుకున్న విద్యార్థులు సైతం అంటున్నారు. ఇలాకాక దేశంలో ఆరోగ్య భద్రతలు పాటించాలి అని నిరక్షరాస్యులకు అవగాహన కల్పించడం మంచిదని ప్రజలు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. వేల సంఖ్యలో మునుషులను మింగేస్తూ మృత్యునాదం చేస్తోంది. దీంతో ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించాయి. భారత ప్రభుత్వం కూడా అనేక మార్గాల ద్వారా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. జనాలు గుంపులు గుంపులుగా కలిసి ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50 కు పెంచింది. దేశంలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే మొత్తం 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.పెంచిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగుతాయని రైల్వే శాఖ ఉత్వర్వుల్లో పేర్కొంది. రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది రైల్వే శాఖ.
*కరోనా* బూచి నెపంతో ప్రజలను ఆర్థికంగా దోసుకొంటున్న రైల్వేశాఖ