శ్రీకాకుళం : మార్చి 30 : పరిశుభ్రత, స్వీయ నియంత్రణతో కరోనా మహమ్మారిని పారద్రోల వచ్చునని జిల్లా జడ్జి ఎం.బబిత తెలిపారు. సోమవారం ఆమె బంగ్లాలో పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కోవిడ్ 19 పరిస్థితుల దృష్య్టా, ప్రజలంతా మరింత అప్రమత్తతతో వుండాలన్నారు.సామాజిక దూరం పాటించాలని, రోడ్లపై తిరగవద్దని కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు.అన్ని రైతు బజార్లను పర్యవేక్షించడం జరిగిందని, సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు కొనుగోలు చేయడం సంతృప్తికరంగా వుందన్నారు.ఇంటికి కావలసిన అన్ని వస్తువులను ఒకే సారి కొనుగోలు చేసుకోవాలని, ప్రతీ రోజూ తిరగరాదన్నారు. ప్రజలు గుంపులుగా తిరగరాదన్నారు ప్రజల బాగానే సహకరిస్తున్నారని చెప్పారు.అన్ని స్లమ్ ఏరియాలలోను శానిటైజేషన్ చేయాలని, బ్లీచింగ్ చేయాలని చెప్పారు. జిల్లాలో క్వారంటైన్ లో వున్న 7 గురికి నెగెటివ్ వున్నందున వారిని ఇంటికి పంపడం జరిగిందని చెప్పారు. విదేశాల నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కాని, కరోనా వైరస్ సోకిన వారి వివరాలు తెలిసినచో, తప్పకుండా తెలియచేయాలన్నారు. కరోనా ప్రకబలకుండా నిబంధనలు పాటించి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజలకు సేవలందించడానికి జిల్లా లీగల్ సర్వీసెస్ ముందుంటుందన్నారు. బయటకు వచ్చినప్పుడు మాస్కులను వేసుకోవాలని, వాటిని ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చునని తెలిపారు. జుడీషియల్ సిబ్బందికి శానిటైజర్లు తయారు చేసే విధానాన్ని నేర్పించడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎమెర్జెన్సీ నెంబర్ 104 ద్వారా సేవలు పొందవచ్చునని అన్నారు. పాత్రికేయులు కూడా ప్రజలకు అవగాహన కలిగించడంలో ప్రముఖ పాత్ర వహించాలన్నారు. జిల్లా ప్రజలు బాగా సహకరిస్తున్నారని నిబంధనలు పాటించి ప్రభుత్వానికి మరింత సహకారాన్ని అందించాలన్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ, పారిశుధ్ధ్య కార్యక్రమాలను అన్ని ప్రాంతాలలోను చేపట్టడం జరుగుతున్నదన్నారు. అన్ని మండల ప్రాంతాలలోను ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం, మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతున్నదన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, డి.ఎల్.ఎస్.ఎ. సెక్రటరీ కె.జయలక్ష్మి పాల్గొన్నారు.