శ్రీకాకుళం : "కరోణా" ఈ మాట వింటేనే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి.మానవాలిని నిత్యం అనేక వ్యాదులు వెంటాడుతూనే ఉన్నాయి.దానికి కారణం పెరుతున్న జనాభా కావచ్చు,అలాగే పెరుగుతున్న కాలుష్యం కావచ్చు.ఈ కాలుష్యంలో మరలా అనేక రకాలు.అవి చెప్పుకుంటే ముఖ్యంగా ఆహార కాలుష్యం ,వాయు కాలుష్యం , శబ్ద కాలుష్యం ఇలా అన్నీ కాలుష్యాలు కలిసి మానవుని ఆయుస్సుని తగ్గిస్తున్నాయని చెప్పవచ్చు.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను మీరు అనుకోవచ్చు. ఈ మద్య సామాజిక మాధ్యమాలలో మీరంతా చూసే ఉంటారు.అదేనండీ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా పొడించడానికి కారణం అయిన "కరోణా"వైరస్.ఈ కరోణా వైరస్ కోసం అప్పుడే మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పారట.అదేంటంటే ఆయన రాసిన ఈ పధ్యం మీరే చదవడం మంచిది.
ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయా
"కోరంకి"యను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగా తూగి సచ్చేరయా "శివగోవింద గోవింద"
ఈశాన్య దిక్కు అనగానే చైనా మనకు గుర్తు వస్తుంది. ఈ "కరోణా" చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తుంది.ఈ విషయం ఆయనకు అదేనండీ మన వీరబ్రహ్మేంద్రస్వామికి తెలుసట.ఇప్పుడు మనం ఈ వ్యాధికి పెట్టిన పేరు కరోణాయే ఆయన కోరంకిగా నామకరణం చేశారట.అలాగని మిమ్మల్ని నేను భయపెట్టడంలేదండోయ్.ఈమధ్య ఆనోటా ఈనోటా విన్నదే నేను చెబుతున్నాను. పెరుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ మాట మీకు చెబుతున్నాను. అందుకే కాలుష్యం తగ్గించడానికి మనవంతు మనం కృషి మనం చేసి మొక్కలను నాటి కాలుష్యం తగ్గించి ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుదాం.దాని వలన మన ముందు తరాల వారిని రక్షించే వారమవుదాం.ఉంటా మరి.అపోహలు విడనాడండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది.