భోపాల్: మధ్యప్రదేశ్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. సింగ్రౌలి వద్ద బొగ్గును తీసుకెళ్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెండు గూడ్స్ రైల్లు "ఢీ"ముగ్గురు దుర్మరణం.