నేడు కోవిడ్-19 కు విరాళమిచ్చిన వారికి ధన్యవాదాలు : కలెక్టరు నివాస్

శ్రీకాకుళం : ఏప్రిల్ 15 :  కోవిడ్ -19 నిధికు రాజాంకు చెందిన అడ్డూరి జ్ఞానితా దేవి అనే చిన్నారి రూ.1450 విరాళంగా అందించింది. బుధవారం రాజాం శాసన సభ్యులు కంబాల జోగులుకు చిన్నారి జ్ఞానితా దేవి రూ. 1450 మొత్తాన్ని అందించింది.తను పొదుపు చేసుకున్న మొత్తం నుండి కరోనా సహాయానికి తన వంతుగా అందించి స్ఫూర్తిప్రదంగా నిలిచింది. చిన్నతనం నుండి ఇతరులకు సహాయపడాలనే గుణం ఉండటం ఉదాత్తమమని శాసన సభ్యులు కంబాల జోగులు అన్నారు. ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చిన్నారిని ఉత్తమ పౌరురాలిగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులను అభినందించారు.వంగర మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ  రూ. 1,17,100/- , పాలకొండ పంచాయతీరాజ్ డిప్యూటి కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్.సుధారాణి  5 వేల రూపాయలు, జిల్లాలో గల పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ,2,65,555 రూపాయలు, రాజాంకు చెందిన అన్నపూర్ణ రైస్ ఇండస్ట్రీస్ 1,00,000 రూపాయలు కల్కీ జ్యూయలర్స్ 1,00,000 రూపాయలు, జిసి క్లబ్.10,000 రూపాయలు  పాలకొండ మండలం వెంకటాపురం దరి చినమంగళాపురంకు చెందిన ఒక వ్యక్తి రూ. 1,500 విరాళంగా అందిస్తూ చెక్కులను జిల్లా కలెక్టర్ జె నివాస్ కు బుధ వారం కలెక్టర్ కార్యాలయంలో అందజేసారు. విరాళాలు అందించిన దాతలకు జిల్లా కలెక్టర్ అభినందించారు. పెద్ద మనసుతో ముందుకురావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.