ఎ.పి.లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో రెండవ నెల కూడా కోతులు

అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్థాయిల్లో జీతాల్లో కోతలు పెడుతున్నట్లు ప్రకటించింది. రిటైర్డ్‌ ఉద్యోగులకు పూర్తి పింఛన్లు అందిస్తామని పేర్కొంది.లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడం, కరోనాపై పోరుకు ప్రభుత్వంమే ఖర్చు చేస్తుండంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించింది.