కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి.ఈ లాక్ డౌన్ పర్యావరణం పరిరక్షణ కోసం బాగా ఉపకరించిందనే చెప్పాలి. ఈ వైరస్‌తో అల్లాడుతున్న మానవాళికి ఇబ్బంది ప్రస్తుతానికి పెట్టినా ఇది నిజంగా శుభవార్తే. అర్కిటిక్‌పై ఓజోన్ పొరకు ఏర్పడిన అతి పెద్ద రంధ్రం పూడుకుపోయింది. స్ట్రాటో ఆవరణంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలతోపాటు అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా ఓజోన్ పొరకు అయిన రంధ్రం మూసుకుపోయినట్టు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.కాగా యూరోపియన్ కమిషన్ తరపున కోపర్నికస్ అట్మాస్ఫియర్ మోనిటరింగ్ సర్వీస్ (సీఏఎంఎస్), కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్)లు ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఈ రంధ్రాన్ని ఈ ఏడాది మార్చి నెలలో తొలిసారి గుర్తించారు. భూమిపైన స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరకుండా రక్షణ కవచడంలా అడ్డుకుంటుంది. ఈ కిరణాలు కనుక మనిషి శరీరాన్ని తాకితే చర్మ కేన్సర్ సహా పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.మరోవైపు ఓజోన్ పొర క్షీణిస్తున్న విషయాన్ని తొలిసారి 1970లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ తప్పిదాల కారణంగానే ఓజోన్ పొర బలహీనమవుతోందని, ఇది మున్ముందు మానవాళికి మరింత ప్రమాదరకంగా మారుతోందని అప్పట్లోనే హెచ్చరించారు.
కరోనా! ! కొంచెం కష్టం. మానవునికి ఎక్కువ లాభం...