రాష్ట్రంలో వృద్ధ కళాకారులకు తక్షణం పెన్షన్లు విడుదల చైయాలి : ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమంలి.

ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గత ఆరు మాసాలుగా వృద్ధ కళాకారుల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒకరోజు ఈ రోజు స్వీయ నియంత్రణలో (లాక్ డౌన్ కారణంగా)దీక్ష.
       ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పెన్షన్లను గత ఆరు మాసాలుగా విడుదల చేయకపోవడం వల్ల పేద వృద్ధ కళాకారుల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్తో కొట్టుమిట్టాడుతున్నారు. నెలవారీగా వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వనందువలన మందు బిళ్ళలను కొనుగోలుకు డబ్బులు లేక తినటానికి ఆహార సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ  నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి మరియు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గారు,అలాగే సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి గారు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర సాంస్కృతిక శాఖా మంత్రి గారికి ఇటీవల లేఖ ద్వారా సమస్యలను  తెలియపరచి నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అసలే కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కళాకారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానం పట్ల కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయకపోవడం అత్యంత బాధాకరం. అందువలన  ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఒకరోజు స్వీయ నిర్బంధంలో నిరాహార దీక్ష చేయటం ద్వారా ప్రభుత్వానికి మా నిరసనను తెలియపరచాలని నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది.  "కరోనా"లాక్ డౌన్ శ్రీకాకుళం  పట్టణంలో  కఠినతరం చేయడం వలన సంఘీభావం తెలుటకు భౌతికంగా రాలేక పోయినా ఫోన్ ద్వారా "జాషువా" అవార్డు గ్రహీత, శ్రీకాకుళ సాహితీ వేత్త,సీనియర్ జర్నలిస్టు శ్రీ నల్లి ధర్మారావు గారు ప్రభుత్వం వెంటనే స్పందించి మీ న్యాయమైన కోర్కెను తీర్చాలని,తక్షణం రాష్ట్రంలో గల వృద్ధ కళాకారులకు పెన్షన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) జిల్లా కార్యదర్శి ఫోన్ ద్వారా తమ సంఘీభావాన్ని తెలుపుతూ కరోనా సమయంలో అనేక వర్గాల వారిని ఆదుకొంటున్న ప్రభుత్వం పేద వృద్ధ కళాకారులను , ఆదుకోవడంలో విఫలమైందని. ప్రస్తుత పరిస్థితిలలో వారిని వెంటనే ఆదుకోవాలని కోరారు.ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షుడు దీక్ష ప్రారంభానికి ముందు ప్రజాకవి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం తన చిన్న కుమారుడు బాల్యం నుండి లవుడు, మునిబాలుడు, ప్రహ్లాద మొదలైన పాత్రలు పోషించిన కిరణ్ కుమార్ యమకు పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టాడు.ఈ సందర్భంగా  ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ కళాకారులు తమ తమ జీవితాన్ని కళకే అంకితం చేసి అవసాన దశకు చేరిన ఈ వృద్ద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటి వరకూ 6 నెలల బకాయి ఇవ్వలేదని తక్షణం బకాయి మొత్తం చెల్లించి వీరిని భవిష్యత్తులో సాంస్కృతిక శాఖనుండి సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేసి  ప్రతి నెలా క్రమం తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక వేల ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే ఇది అంతం కాదని ఆరంభం మాత్రమేనని రాష్ట్ర వ్యాప్తంగా మా పోరు విస్తరించాల్సి వస్తుందని అంతవరకు రాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్ర ప్రజానాట్యమండలి కార్యదర్శి చంద్రా నాయిక్ వాట్స్ యాప్ కాల్ ద్వారా దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వృద్ధ కళాకారులకు పెన్షన్లు వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నుండి లక్ష్మణరావు రాష్ట్ర సహాయ కార్యదర్శి పోన్ ద్వారా దీక్షకు తమ మద్దతు తెలిపారు.రాష్ట్ర నలుమూలలనుండి వృద్ధ కళాకారులు,ప్రజా కళాకారులు తమతమ మద్దతును ఫోన్ చేసి తెలుపుతూ వెంటనే వారికి ఇవ్వవలసిన బకాయి మొత్తం విడుదల చేసి ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఆదుకోవాలని కోరారు.అనంతరం సాయంత్రం 5గంటలకు తమ సతీమణి కళాకారిణి రాధాలక్ష్మి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.