హైదరాబాద్ : కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నప్రాణాంతక వ్యాధి. దీని నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఇంటికే పరిమితమై దూరం దూరంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ వైరస్ బాధితుడు తుమ్మినా, దగ్గినా సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. కానీ తాజా అధ్యయనంలో మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. వ్యాధి సోకిన వ్యక్తితో మాట్లాడినా కూడా ఈ వైరస్ అంటుకుంటుందని వెల్లడైంది. యూఎస్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనంలో ఇది తేలింది. డాక్టర్ హార్వే ఫినెబర్గ్ అధ్యక్షతన ఓ కమిటీ కరోనా వైరస్ వ్యాప్తి అంశంపై పరిశోధనలు ప్రారంభించింది. కొన్ని రోజులు అధ్యయనం చేసిన తర్వాత ఆ విషయాలను వైట్ హౌజ్‌కు తెలిపింది. దీంట్లో మాట్లాడినా కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్ ఫినెబర్గ్ హెచ్చరించారు. ఏదో ఒక మాస్క్ వేసుకొని బయటకు కాలు పెట్టడం మంచిదని ఈ బృందం అభిప్రాయపడ్డారు. నోరు,ముక్కు, కళ్ల నుంచి నేరుగా ఊపిరితిత్తులకు చేరే ఈ వైరస్‌ను అడ్డుకోవాలంటే మాస్క్ ధరించక తప్పదని సూచించారు. తుమ్మినా, దగ్గినా, నోటి తుంపరల ద్వారా కూడా ఇది రోగితో మాట్లాడినా కూడా ప్రమాదమేనన్నారు. కరోనా సోకిన రోగికి ఆరు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా తుమ్ము లేదా దగ్గు వల్ల వైరస్ వ్యాపిస్తుందనే విషయం కూడా వాస్తవమేనని ధృవీకరించారు.
మాట్లాడినా "కరోనా" వైరస్ సోకుతుంది.