కరోనా పేరు వినని వారు ప్రపంచంలో నేడు లేరు. కారణం ఈ కరోనా వార్తలు ఈ మద్య నిత్యం ప్రింట్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ వ్రాసి,వ్రాసి ..చూపించి చూపించింది మన జర్నలిస్టు సమాజం. నిజమే భారత ప్రభుత్వం "ఆరోగ్య అత్యవసర పరిస్థితులలో మొత్తం దేశానికి తాళం వేసింది. ఇంకా మాకు వ్రాయటానికి,చూపటానికి మరి ఏమీలేదు. అందుకే మాలో కొందరు ఈ సమాజానికి ఆర్థిక సహాయం చేసిన వారు ఏ చేయితో సహాయం చేశారు, ఎంత చేశారు , వారు ఈ సమాజానికి ఇంత చేస్తే ఇంకా వారి దగ్గర ఇంకెంత ఉంది? మొదలైన వార్తలు సేకరణ చేస్తుంటే, మరి కొందరు ఏకంగా కలసి మెలసి తిరుగుతూ ఉన్న మన జర్నలిస్టులలో ఎవరు ఎంత చదువు చదివారు. ఎవరు ఏమి చేస్తున్నారు నిఘా పెట్టి వార్తలు వ్రాస్తూ నేటి సమాజంలో మన జర్నలిస్టులు ప్రజల ముందు తమ విలువలు తామే తీసుకొని సమాజంలో అవహేలనకు అవకాశం ఇస్తూ వార్తలు వ్రాయడం,చూపడం చూసిన విభజించి పాలించే అధికారులు వద్ద గానీ అలాంటి ప్రజాప్రతినిధుల వద్ద గానీ చివరకు మన సమాజంలో మనమే తలదించుకోలసి వస్తుంది. నిజం మిత్రులారా ఈ పోకడ మనకు గానీ ,పోనీ ఈ సమాజానికి గానీ మంచిదా? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మనం సమాజానికి ఉపయేగపడే వార్తలు వ్రాసి,చూపి సమాజానికి మేలు చేయడం మరవద్దు మిత్రులారా ? అంతేగాని మరియే వార్తలు లేవనో మరియు మనలో మనకు ఉన్న విభేదాలుతో గానీ మనం మనం ఈ రీతిగా మారడాన్ని సమాజం చీదరించుకొంటుంది. తీరా మనం వ్రాసిన వార్తలు , శీర్షికల వలన ఈ సమాజానికి మనపై ఎటువంటి సంకేతాలు పంపుతున్నాం. మనకు మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేటి సమాజంలో అన్ని వ్యవస్థలలో కుళ్ళు కడగడానికి ఒక వ్యవస్థ ఉందని మనకు తెలుసు.ఆ పని మనది కాదు.మనం ఇటువంటి బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న మన బాధ్యత ఎంత వరకు నిర్వర్తిస్తున్నాము. సరే మనలో చదువు లేనివారు వచ్చి మనకూ ఈ సమాజానికి హాని చేస్తున్నారు అనుకొందాం ! దానికి కారణం మనం కాదా ? నేటి రాజకీయాలలో ప్రవేశించిన సమయానికి మన పూర్వపు ముఖ్యమంత్రికి రెండు ఎకరాల వారేనని మనం చెప్పుకొంటున్నాం . మరి ఆయనకు నేటి ఆస్తి ఆ రెండెకరాలేనా ? పోనీ పెరిగింది అనుకొన్న అడిగే దమ్మున్న వ్యవస్థ మన సమాజంలో ఉందా? తీరా మనకోసం మనం ఆలోచించినా మనలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగం వదిలి సమాజానికి మేలు చేయడానికి మన వృత్తికి వచ్చాము...మనకు అతి చిన్న ఉద్యోగం వచ్చినా మన వృత్తికి దండం పెట్టి ఉద్యోగంలో చేరడానికి మనం లేమా? వద్దు మితృలారా మనలో మనకు ఈ విద్వేషాలు వద్దు.వద్దు..వద్దు...ఈ రోజు మన రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఏలుతున్న రాజకీయ నాయకులు ఎందరు వారి పార్టీలు వీడి వేరువేరు పార్టీలలో లేరు. మనం అలాగే ఒకే యూనియన్ నుండి వేరు వేరు యూనియన్ లలో చేరవచ్చు. ఆ యూనియన్ లో పెద్ద పెద్ద పదవులు చేపట్టవచ్చు. కానీ చివరకు మన వృత్తి జర్నలిజం అని మరువొద్దు మితృలారా. మనకు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఏమైనా ఇచ్చి పోషిస్తుందా ? ఈయక పోయినా బ్రతకటానికి మనలో కుటుంబాలు లేని సన్యాసులెందరు ? తీరా మనలో కొందరికి స్వంత పేపర్లు,చానల్లు ఉన్నాయి. మనం మన విలేకరులకు ఎంత జీతం ఇస్తున్నాము. అందుకే మనలా అందురు ఉండాలి అనుకోవడం తప్పని నేను భావిస్తున్నాను. నేటి సమాజాన్ని ఒక సారి పరిశీలిస్తే ఒక రకంగా మనలో ఇంకా కొంత నిజాయితీ ఉందని చెప్పవచ్చును.ఒకసారి ఎదుటి వారిని విమర్శించే ముందు మనమేమిటి అన్నది ఆలోచించాలి మితృలారా. వార్తలు లేకుంటే ఇతిహాసాలలో గల మంచిని రోజుకు ఒక శీర్షిక ఇవ్వండి. సమాజానికి మేలు చేసిన వారు అవుతారు. అంతేకాని ఇలా మనలో మనం ఉన్నది కొంత లేనిది మరికొంత వ్రాసి మన జర్నలిస్టు విలువలు తీయడం సరికాదని నా మనవి. నా ఈ శీర్షిక ద్వారా ఎవరికి ఇబ్బంది పెట్టాలని,లేదా ఎవరి మనో భావాలను దెబ్బతీయాలని మాత్రం భావించి నన్ను ద్వేషించవలదని నమస్కరించి నేను నేటికి సుమారు రెండు దశాబ్ధాలుగా మీతో కలిసి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తిగా ఈ మద్య మన సమాజంలో కొన్ని పత్రికలలో వచ్చిన వ్యాసాలను చదివి చలించి ఈ కధనాన్ని వ్రాశాను. వీటితోనైనా మన జర్నలిస్టు లోకం మేల్కొని సమాజంలో మంచి విలేకరులుగా గుర్తింపు పొందాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.నమస్కారం. నేటి సమస్య "కరోనా" వాటిపై ప్రజలకు అవగాహన కల్పించే దిశలో నడుస్తూ సమాజానికి కరోనా వైరస్ చోకకుండా అవగాహన కల్పించాలని మరొకసారి మితృలను కోరుతున్నాను.
ఇది జర్నలిజమా ? సమాజంలో మన పాత్ర ఏమిటి ?