కేంద్రం లాక్ డౌన్ మరికొంత సడలింపు.

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపులను దశలవారీగా పెంచుతోంది. ఐతే ఈ మినహాయింపులను అమలు చేసేదీ లేనిదీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉంటుంది. తాజాగా స్కూల్ బుక్స్ అమ్మే షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అమ్మే షాపులు తెరచుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. అంతేకాదు ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు రీచార్జ్ చేసే సౌకర్యంను కూడా లాక్‌డౌన్ నుంచి తప్పించింది. కాబట్టి మొబైల్ రీచార్జ్ షాపులు ప్రత్యేకంగా ఈ ఒక్క సేవ కోసం తెరచుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కి బెడ్‌సైడ్ అటెండెన్స్‌గా ఉండేవారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐతే రాష్ట్రాల ప్రభుత్వాలు ఇందుకు అంగీకరిస్తేనే. ఉదాహరణకు తెలంగాణలో ఇవి అమలవ్వవు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను మే 7 వరకూ కొనసాగిస్తోంది. ఏపీలో ఈ మినహాయింపులు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.పట్టణాల్లో ఉండే బ్రెడ్ తయారీ పరిశ్రమలు, పాల ప్యాకింగ్ ప్లాంట్లు, పిండి మిల్లులు, పప్పుల మిల్లులు తిరిగి తెరచుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది. సడెన్‌గా ఎందుకీ మినహాయింపులు ఇస్తున్నారంటే చాలా మంది కేంద్రానికి ఇలాంటి అభ్యర్థనలు పెట్టుకోవడంతో కేంద్రం సరే అని సడలించింది. మామూలుగా అయితే లాక్‌డౌన్ మే 3 వరకూ అమల్లో ఉండనుంది.పైవన్నీ  తెరిచినా తప్పనిసరిగా సోషల్ డిస్టాన్స్ పాటించాలని కేంద్రం తెలిపింది.