సంతకవిటి : స్థానిక మండలం పరిధిలో గల ప్రతి గ్రామ సచివాలయంలో అత్యంత పేద కుటుంబాలను గుర్తించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వంలో సమాజంలో మేము సైతం అని సహాయంతో ముందుకు వచ్చిన మండల పోలీసుల సహాయం అమోఘమని జిల్లా సూపరెండెంప్ ఆఫ్ పోలీసు (యస్.పి.)కొనియాడారు. ఈ సందర్భంగా సంతకవిటి మరియు మోదుగులపేట గ్రామ సచివాలయం పరిధిలో పేదలకు యస్.పి అమ్మిరెడ్డి గారి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఒక అంటువ్యాధని దీనికి అందరూ ప్రభుత్వం సూచించే విధంగా స్వయం నియంత్రణ వలన ఈ వైరస్ రాకుండా ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరించి కరోనాను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇంతవరకూ మన జిల్లా ప్రజలు బాగా సహకారం ఆరోగ్య,పోలీసు శాఖలకు అందించడం జరిగిందని అలాగే భవిష్యత్తులో కూడా ఎవరికి వారు బాధ్యతగా స్వయం నియంత్రణ పాటించి మీ ఆరోగ్యాలను మీరే రక్షించుకోవాలన్నారు. భారత ప్రభుత్వం ,అలాగే రాష్ట్ర ప్రభుత్వం "లాక్ డౌన్" ప్రకటించడం వలన కొన్ని కుటుంబాలకు పని లేక ఇబ్బందులు పడుతున్నారు. అటివంటి వారిలో మండలంలో కొందరిని గుర్తించి ఉడతాభక్తిగా మా శాఖ ద్వారా కూడా చేయడం నాకు ఆనందంగా ఉందన్నారు. ఇలాగే సమాజంలో మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి పేదప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు."కరోనా" ప్రమాదకారి కాదని అలాగని ఆదమరిచితే మహమ్మారిగా మారి సమాజాన్ని అతలాకుతలంచేస్తుందని ఈ వైరస్ కు మందు లేదని స్వయంగా స్వీయ నియంత్రణే మార్గమని ప్రజలు అప్రమత్తంగా ఉండి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.యస్.పి.రారాజు ప్రసాద్, సి.ఐ.శ్రీనువాసరావు,స్థానిక స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు మరియు మండల పోలీసు సిబ్బంది, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
"కరోనా" సందర్భంలో పేదలకు సహాయం చేయుటలో సంతకవిటి పోలీసులు ఆదర్శం :యస్.పి.అమ్మిరెడ్డి.