అనంతపురం : కరోనా మహమ్మారికి ఆంధ్రప్రదేశ్‌లో మరొకరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. జిల్లాలోని హిందుపురానికి చెందిన ముస్తాక్ ఖాన్ (56) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 164కి చేరింది. అలాగే నలుగురు పాజిటివ్ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో రెండవ "కరోనా" మరణం