ఇక వ్యవసాయ కార్యకలాపాలకు "లాక్ డౌన్" మినహాయింపు .

దిల్లీ: కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ.. వ్యవసాయ అనుబంధ, రైతులు, వ్యవసాయ కూలీలు, పంట సేకరణదారులు, మార్కెట్‌ నిర్వాహకులు, పంట కోతల యంత్రాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. పంట కోతలు, విత్తనాల నిర్వహణ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.