లాక్‌డౌన్ నేపథ్యంలో మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. కొందరైతే వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరికొందరేమో ఏది పడితే అది తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో మందు దొరక్క శానిటైజర్ తాగి ఒకరు మరణించిన ఘటన మరువకముందే తమిళనాడులో కూల్ డ్రింక్‌లో వార్నిష్ కలుపుకొని తాగి ముగ్గురు మరణించినట్లు తెలుస్తుంది.చెంగల్పట్టులో కారు డ్రైవర్‌గా ఉన్న శివరామన్ తన మిత్రుల సలహాలతో కూల్ డ్రింక్‌లో వార్నిష్ కలిపి తాగారట. అతడితో పాటు మరో ముగ్గురు ఇదే ద్రావణాన్ని తాగారు. దీంతో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తమిళనాడులో మందు లేక కూల్ డ్రింక్‌లో వేరే ద్రావణాలు కలిపి తాగి మరణించిన వారి సంఖ్య 6కు చేరింది.
దేశంలో మందు దొరకక మందుబాబుల వింత ప్రయోగాలు వెరసి మరణాలు