సంతకవిటి : "కరోనా" విపత్తుతో ప్రపంచం కల్లోల పరిస్థితులు అనుభవిస్తున్నందు మన దేశంలో ప్రభుత్వం "లాక్ డౌన్" ప్రకటించిన విషయం ప్రజలకు విధితమే.అయితే ప్రజలు పనులకు వెళ్ళకుండా ఉన్నందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కార్మికులను ఆదుకొనే సదుపాయం ప్రకకటించి రేషను కార్డు కలిగిన అందరికీ గత నెల 29 వ తేదీన ఉచితంగా బియ్యం,మరియు పప్పు మొదలైన సరుకులు సరఫరా చేస్తామని మీడియాముఖంగా ప్రకటన చేయడం మన అందరికీ తెలిసిన విషయం. అదే సమావేశంలో కార్డుదారులందరికీ ఒక్కో ఇంటికి 1000/రూపాయలు ఇస్తామన్నారు. ఆ వెయ్యి రూపాయలు ఇచ్చే జి.ఓ కూడా ఈ దినము విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ గత నెల 29వ తేదీన ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకూ స్థానిక మండలంలో ప్రజలకు అందలేదని ప్రజలు చెపుతున్నారు. ఈ జాప్యం జరగడానికి ప్రభుత్వమే కారణామా?లేక అధికారులు నిర్లక్షమా? లేక ప్రభుత్వం నియమించిన వాలంటరీల అలసత్వమా? అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి మాటిచ్చిన ఇంటింటికీ వెయ్యి రూపాయలు ఇంకా ఎన్ని నాల్గు పడుతుంది అని ప్రజలు ఆరా తీస్తున్నారు.దీనిపై అధికారులు స్పందించి వెంటనే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.
ఈ ఆలస్యానికి కారణం ఎవరు : కరోనా సహాయం అందక ప్రశ్నిస్తున్న ప్రజలు