నిరక్షరాస్యత అవగాహనారాహిత్యం మరియు అశ్రద్ధ వెరసి జిల్లాలో కరోనాకు అంకురార్పణం.నేడు ప్రపంచాన్ని అన్ని విధాలుగా కల్లోలమయం చేస్తున్న "కరోనా" భారతదేశంలో కొంత అదుపులో ఉన్నప్పటికీ,అది రానురాను పోజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.దీనికి కారణం ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ప్రజలలో అవగాహన లేక సామాజిక బాధ్యతను వీడి,ఆ,,,,,మనకేం అవుతుందిలే అని ఎవరికి వారు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇది కనిపించని కరోనా వైరస్ కు మానవ సమాజానికి జరుగుతున్న ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో చివరికి గెలుపెవరిదో తెలియని నిఘూడ రహస్యం.ఈ మహమ్మారి ప్రపంచ దేశాలలో మన సమాజాన్ని భయబ్రాంతులు కొలుపుతూ చాప క్రింద నీరులా పట్టణాలకు గ్రామాలకు విస్తరిస్తుంది. కొంచెం ఆలస్యంగానైనా మన దేశం మేల్కొని "లాక్ డౌన్" ప్రకటించి ప్రజలకు ఇల్లకే పరిమితం చేయాలని మనకోసమే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే,అది ఎంతో శిక్షలా అవగాహన లేని ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ వారికే గాక వారి శ్రయోభిలాషులైన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు,చుట్టుపక్కల వారికి ఈ వైరస్ బారిన పడటానికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామాలలో ప్రజలకైతే ఇంకా ఈ వైరస్ కోసం పూర్తిగా తెలియదు అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకూ ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా,నాగరికత మొదలైన వాటిలోనే గాక "కరోనా" లో కూడా వెనుకబడిన మన శ్రీకాకుళం జిల్లా ఒకే రోజు అమాంతంగా మూడు పోజిటివ్ కేసులతో బోనీకొట్టి పరుగులు తీయడానికి ప్రయత్నం చేయడం వలన ఇప్పుడే ప్రజలకు భయం పట్టుకొందనే చెప్పవచ్చు. ఇంతవరకు వాలంటరీలు ఆరోగ్య కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఎంత చెప్పిన వినని ప్రజలు ఇప్పుడు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు.కరోనా విషయంలో బోనీ కొట్టడం కాస్త ఆలస్యం అయినా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తుందేమో అని ఇప్పుడు భయపడుతున్నారు. కారణం ఏమిటంటే ఈ మధ్య పనులకు వలసలు వెల్లిన కార్మికులు అధికారుల కల్లు కప్పి స్వంత గ్రామాలకు అధిక సంఖ్యలో చేరారని పల్లె ప్రాంతాలలో సైతం ఆనోటా ఈనోటా అనుకొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు అవగాహన కల్గి తమతమ ఆరోగ్యాలపై శ్రద్ధ చూపకపోతే ఈ యుద్ధంలో కరోనాకు జయం, మానవాలికి అపజయం తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ మందులేని మహమ్మారి ఈ "కరోనా" అని దానిని మన మానవ సమాజంనుండి తరిమి జయం పొందాలంటే మనిషికి మనిషికి మద్య భౌతిక దూరం పాటించి, మన పరిసరాలు శుభ్రంగా ఉంచి, ఎవరి ఇల్లలో వారు ఉండాలి.ఒకవేల వృత్తి రీత్యా అవసరాలరీత్యా బయటకు వెళ్ళినా సామాజిక దూరం పాటించి ,ముఖానికి మాస్కు ధరించి,ఇంటికి వచ్చిన వెంటనే దుస్తులు తడిపి సబ్బుతో స్నానం చేయనిది ఇండ్లలో ఉన్న వారిని తాకకుండా జాగ్రత్త పడాలి.ఎప్పటికప్పుడు చేతులు శానిటైజర్ తో క్లీన్ చేసుకొంటూ ముఖాన్ని నోటిని ముక్కు కల్లను తాకకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనతో ఉన్న వారికి అవగాహన కల్పించి మనము మన మానవ సమాజం ఈ యుద్ధంలో గెలిచి మనం విజయం సాధించడానికి అందరం ఇల్లకే పరిమితం కావాలని కోరుకొంటూ...... మీ గురుగుబెల్లి రాజేశ్వరరావు ,ఎడిటర్ కళింగ రాజ్యం మరియు ప్రజాధ్వని.
శ్రీకాకుళంలో "కరోనా" బోనీ