ఆపత్కాలంలో సమాజాన్ని ఆదుకుందాం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించుదాం : పశుసంవర్దక శాఖ డి.డి.ఎం.జగన్నాదం.

శ్రీకాకుళం : కరోనా వ్యాధి నివారణకు విధించిన "లాక్ డౌన్" లో ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో పాలు,మాంసం,గుడ్లు ఉత్పత్తులు, సరఫరా పరిస్థితిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కు నియమించిన పశు సంవర్ధక జిల్లా కమిటీ పర్యటించింది.ఈ కమిటీ తోటపాలెం మొదలైన ప్రాంతాలలో పర్యటించి రైతులను,పాలు,మాంసం,గుడ్లు,వినియోగదారులను అడిగి క్రయ విక్రయాల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.వీరిలో  శ్రీకాకుళం ఉపసంచాలకులు డాక్టరు .ఎం.జగన్నాథం, డాక్టరు  మాదిన ప్రసాదరావు, సహాయ సంచాలకులు డాక్టరు .నారాయణరావులు పర్యటించి స్థానిక కోళ్ల ఫారాలు, పాల కేంద్రాల్ని తనిఖీ చేశారు.గుడ్లు రవాణా,మేత దినుసులు సరఫరాలో ఉన్న సమస్యలను సమీక్షించారు. బ్రాయిలెర్ కోడి పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో పెంచడానికి రైతులు ముందుకు రావడం లేదని రైతులు, గిట్టుబాటు ధర రాదేమోననే భయం వెంటాడుతోంది అని రైతులు వీరితో అన్నారు. అయితే కరోన భయంతో మొదట్లో ప్రజలు గుడ్లు,మాంసం తినకపోవడం వల్ల అప్పటి పరిస్థితుల్లో ధరలు తగ్గాయని, కానీ ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉండడంతో రేట్లు బాగున్నాయి కనుక కోళ్ల రైతులు అపోహలు వదిలి మళ్ళీ పూర్వస్థితికి రావాలని అధికారులు వివరణ ఇచ్చారు. దాణా,కోడిపిల్లల రవాణా,టీకాలు సరఫరాలో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే చాలావరకు పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని, లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న 24 గంటల కాల్ సెంటర్ కు తెలియజేస్తే  ఉన్నతాధికారుల దృస్తికి తీసుకుని వస్తే సమస్యలను  త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గుడ్లు,పాలు,మాంసం అమ్మకాలు కొనసాగించాలని,అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని,కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో ఉత్పత్తులు తగ్గకుండా అన్ని రంగాల్లో రైతులు ముందుకు వచ్చి సహకరించాలని రైతులను కోరారు.నేడు కరోనా సమస్యతో ప్రపంచం ఉందని,ఇటువంటి ఆపద కాలంలో మన సమాజాన్ని మనమే రక్షించుకోవాలని అందుకే అందరం కలసి సామాజిక బాద్యత వహించి పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకొని, సామాజిక దూరం పాటించి కరోనాను తరిమి కొడదామని ఈ కమిటీ  పిలుపిచ్చారు.