దిల్లీ : లాక్‌డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే లాక్‌డౌన్ పొడిగించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దిల్లీలో విలేకర్లతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు తయారు చేశామన్నారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. కంటెయిన్‌మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఇచ్చిన సూచనల ఆధారంగానే జోన్లుగా విభజించామని వివరించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆర్థిక వ్యవహారాలు నడుపుకునే వెసులుబాటు ఇచ్చినట్లు తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కిషన్ రెడ్డి హెచ్చరించారు.దేశంలో రాష్ట్రాలతో కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు.గత వారంలో ఒక్క కేసు నమోదు కాని జిల్లాలు మన దేశంలో 80 ఉన్నాయన్నారు.21 రోజులుగా ఒక్క కేసు నమోదు కాని జిల్లాలు 40 కేసులని గడిచిన 28 రోజులుగా ఒక్క కేసు నమోదు కాని జిల్లాలు 26 అని దేశవ్యాప్తంగా కరోనా ప్రత్యేక ఆసుపత్రులు 774 పని చేయడం జరుగుతుందని అన్నారు.
దేశంలో సిద్ధంగా 30 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు నిల్వ ఉన్నాయన్నారు.
వలస కార్మికులను తరలించేందుకు 300 రైళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
దేశంలో రాష్ట్రాలతో కలిసి "కరోనాపై దాడి : కేంద్ర మంత్రి : కిషన్ రెడ్డి .