రోమ్ : కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీ బాడీలను ఉత్పత్తిచేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పనిచేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. నోవల్ కరోనా వైరస్ వ్యాక్సీన్‌కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో పేర్కొన్నారు. ఈ వేసవి తర్వాత మానవులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
కరోనాకు మందొచ్చిందోచ్....ఇటలీ ప్రభుత్వం ప్రకటన