సి.పి.ఐ.రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఒక్క పూట మౌన దీక్ష : ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు .

కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో బాగంగా ఈ రోజు అనగా మే 4వ తేదీన "కరోనా" విపత్తు కారణంగా నష్టపోయిన రైతులను, భవన నిర్మాణ కార్మికులను, వలస కూలీలను,చేనేత కార్మికులను,పేదలను, సంఘటిత, అసంఘటిత కార్మికులను అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఆహార నిల్వలను కుటుంబానికి 50 కేజీల బియ్యం 50 కేజీల గోధుమలు పంపిణీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం 5వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 వేల రూపాయలు కలిపి ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. రైతులు,చిరు వ్యాపారులు స్వయం ఉపాధి క్రింది తీసుకున్న బ్యాంకు రుణాలు రద్దు చేయాలి. చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఒక లక్ష కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి.రాష్ట్రంలో ఆకలి చావులు లేకుండా ప్రజలను ఆదుకోవాలి. గ్రామీణ ఉపాధి పనులను రైతులు వారి వారి పనులకు వర్తింపజేయాలి. పెన్సనర్లకు పూర్తి పెన్షన్ చెల్లించాలి,ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులను,తమకు సహకరించే వైద్యసిబ్బందికి, పోలీసులు, పారిశుద్య కార్మికులకు, ఆహార పదార్థాలు లోటు లేకుండా ఒక చోట నుండి వేరొక చోట్లకు రవాణా చేస్తున్న గూడ్సు సిబ్బందికి, మీడియా మిత్రులకు వారి సేవలను గుర్తించి ప్రోత్సాహకాలివ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేస్తూ ఈ రోజు మౌనదీక్షలను చేయడం జరుగుతుంది. అందులో బాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి శ్రీకాకుళం జిల్లా శాఖ తరుపున రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన గృహం కావలిలో ఒక్క పూట మౌన దీక్ష చేసి పై డిమాండ్లను తక్షణం తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.