ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దిన శుభాకాంక్షలు : ప్రెస్ క్లబ్ శాస్వత అధ్యక్షుడు రాజేశ్వరరావు .

పత్రికా స్వేచ్చ మన సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది.ఏ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది.తద్వారా సమాజానికి మానవాలికి ఎంతో ఉపయోగ పడుతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 3వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో ఈ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు.అప్పటి నుండి ఈ రోజును పాత్రికేయులు ప్రపంచ  పత్రికా స్వేచ్ఛా దినంగా చేసుకోవడం జరుగుతుంది. అటువంటి ఈ దినాన్ని పురష్కరించుకొని శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ శాస్వత అధ్యక్షుడు గురుగుబెల్లి రాజేశ్వరరావు పాత్రికేయ మితృలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.